గీసుగొండ, డిసెంబర్ 17 (ఆంధ్రప్రభ) : టీ తాగడానికి ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ధర్మారం వద్ద చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… మామునూరు మండలం నక్కలపల్లికి చెందిన పసునూరి కుమార్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఉదయం 5:30 గంటలకు నాయుడు పెట్రోల్ పంప్ వద్ద ఒక ఇటుక బట్టీలో ఇటుకలోడు చేసుకొని నర్సంపేటకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో టీ తాగుదామని ధర్మారం బస్టాండ్ వద్ద ట్రాక్టర్ ఆపి రోడ్డు దాటుతుండగా మచ్చాపురం నుండి వరంగల్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.