తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ తమిళి సై కి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ గవర్నర్ కు లేఖ రాశాడు. ఈ లేఖకు వేగంగా స్పందించిన గవర్నర్ వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఫోన్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు. కరోనా భయంకర పరిస్థితులలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఉత్తంకుమార్ గవర్నర్ కు వివరించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ ఇస్తానన్న గవర్నర్ తమిళిసై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తో తాను మాట్లాడతానని ఉత్తమ్ కుమార్ కి హామీ ఇచ్చారు.
ఇక ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ పిటిషన్ దాఖలు చేశారు. రెండు దఫాలు ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు మున్పిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.