తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు కరోనా, మరోవైపు కేసీఆర్… ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కరోనాతో పేదల జీవితాలు దుర్భరంగా మారాయని అన్నారు. కేసీఆర్ అధికార పీఠం నుంచి దిగిపోతే రాష్ట్రంలో సమస్యలు కూడా తొలగిపోతాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఒక తరం యువతకు తీరని నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్, సీతక్క బలపరుస్తారా?