Monday, November 18, 2024

పెట్రో ధరలకు నిరసనగా రేవంత్ సైకిల్ ర్యాలీ..

దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో, గ్యాస్ ధరలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీ చేపట్టనున్నారు…కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ ర్యాలీకి ఏఐసీసీ పిలుపునిచ్చింది. మొదటగా జులై 12 సోమవారం రోజున ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఐదు కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డిగారు సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిగారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. నిర్మల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శంఖారావం పూరించనున్నట్లు తెలిపింది టీపీసీసీ. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఈ ఏడాది థర్డ్ వేవ్ ఉండదు: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement