తెలంగాణలో ధరణి, భూ సమస్యల అంశాలపై పరిశీలనకు టీపీసీసీ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ ఛైర్మన్ గా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కన్వీనర్ గా ఉండనున్నారు. ఇక, కమిటీలో సభ్యులుగా ఈరవర్తి అనిల్, బెల్లయ్య నాయక్, కొండపల్లి దయాసాగర్ స్థానం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ లను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. ఈ కమిటీ ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సేకరణ అంశాలపై అధ్యయనం చేసి 45 రోజులలో టీపీసీసీకి నివేదిక ఇవ్వానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital