Tuesday, November 26, 2024

Tourist Spot – మల్టీ జోన్ పార్కును పరిశీలించిన సభాపతి

బాన్సువాడ, జూలై 17 ప్రభ న్యూస్ – బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని కల్కి చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మల్టీ జోన్ పార్కును సోమవారం ఉదయం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాసర పట్టణం బ్యూటిఫికేషన్ లో భాగంగా స్థానిక కల్కి చెరువు వద్ద నాలుగు కోట్ల రూపాయలతో మల్టీజోన్ మార్కును ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ సహకారంతో టి యు ఎఫ్ ఐ డి సి పథకం కింద మంజూరు చేసిన నిధులతో పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఉమెన్, సీనియర్ సిటిజన్, పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, వాకింగ్ చేయడానికి, యోగా, ధ్యానం చేసుకోవడానికి, చిన్నారి పిల్లలు ఆడుకోవటానికి ఏర్పాట్లు ఉండటంతో పాటుగా రెస్టారెంట్, పార్కింగ్, బాత్రూంలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

బాన్స్వాడ పట్టణంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో ఇక్కడ నివాసం ఉండి ఏర్పాటు చేసుకున్న జనాభా పెరుగుతుందని, పార్కులో ఏర్పాటుతో మంచి వాతావరణంతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. ఇలా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి పార్కు ఉమ్మడి జిల్లాలలో ఎక్కడ లేదని ఆయన వివరించారు. ప్రజల కుటుంబ సభ్యులతో వచ్చి ప్రశాంతంగా సేద తీర్చడానికి ఈ పార్కు ఉపయోగపడుతుందని వారు నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.

సభాపతి వెంబడి కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ శాఖ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు, బాసుల మండల ఆత్మ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement