Wednesday, November 20, 2024

Top Story – ద‌శ‌దిశ‌లా తెలంగాణ దుందుంబి – సంక్షేమ అభివృద్ధి ఛాంపియ‌న్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాజకీయ వ్యూహాల్లో రాటుదేలిన నేతగా తనదైన శైలిలో సుపరిపాలనకు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రస్తుతం దేశానికి మార్గదర్శిగా, అభివృద్ధికి ప్రతిబింబంగా అవతరించారు. మూడోసారి అధికారమే లక్ష్యంగా ఆయన ప్రజలకు మరింత దగ్గర య్యేందుకు తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలు ఆశించిన కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితా న్నిచ్చాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల మైండ్‌ బ్లాకయ్యేలా ఆయన వ్యూహరచన విజయ వంతమై రాజకీయ చతురతకు నిలువు టద్దంగా నిలిచింది. చేసిన అభివృద్ధిని ప్రజ ల్లోకి వెళ్ళి చెప్పుకోండంటూ.. తన పార్టీ ఎమ్మెల్యేలకు పదేపదే చెప్పిన భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌.. ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజా ప్రతినిధుల వ్యవస్థనే కాదు.. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా రంగంలోకి దింపా రు.

ఎక్కడ మీట నొక్కితే.. అది ఎక్కడ పేలు తుందో తెలిసిన వ్యక్తిగా పదేళ్ళ పాలన పండగంటూ, ‘తెలంగాణ దశాబ్ది’ ఉత్సవా లను ప్రారంభించి తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా చేశారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగా లను రెండు కళ్ళుగా భావించి సమాన ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న సీఎం కేసీఆర్‌ సంక్షేమంలో సాటి లేదన్న నినాదంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. అయితే, ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న మూడు వారాల రాష్ట్ర సర్కారు పండగ దశాబ్ది ఉత్సవాలు, ఒకరకంగా సమాజంలో కేసీఆర్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టాయి. మరోకోణంలో అన్ని సంక్షేమ పథకాల్లో చురుకుదనం పెరిగేలా కూడా చేశాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాల్లో లక్షలాదిగా ఉన్న లబ్ధిదారుల్లో చైతన్యం వచ్చేలా దోహదపడ్డాయి. అదే సమయంలో కేసీఆర్‌ సర్కారు ఘనత దేశమంతా వినిపించేలా.. ఉత్సవాల ప్రభావం మారుమ్రోగింది. సరిగ్గా ఎన్నికల సమయంలోనే బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను దక్షిణాదిలో విస్తరించి అనేక ప్రాంతీయ పార్టీల నేతలను ఆకర్శించారు కూడా. తెలంగాణ సర్కారు సాధించిన అభివృద్ధిని చూసి ఉత్తరాది రాష్ట్రాలు సైతం ఆశ్చర్యపోయేలా చేయడం కేసీఆర్‌ ఘనతేనని విస్తృతంగా చర్చ జరుగుతోంది.

నిత్యం జనంలో ఉండేలా కార్యాచరణ
ఎవరెన్ని చెప్పినా ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజికంగా, రాజకీయంగా ‘బీఆర్‌ఎస్‌’దే పైచేయిగా నిలిచింది. ఆరంభం అద్భుతం.. ముగింపు విజయోత్సవ సంబురం.. అన్న భావన ప్రతిపక్ష పార్టీల నేతల్లోనూ కలిగేలా దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇంతటి ప్రతిష్టను తెచ్చిపెట్టిన అవతరణోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. అంతలోనే మరో ప్రణాళికలో ప్రజల్లోకి వెళ్ళేందుకు కేసీఆర్‌ సంసిద్ధమై ఉన్నారు. యువ సమ్మేళనాలు, విద్యార్థి సమ్మేళనాల పేరుతో గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్‌ చేశారు. వచ్చే ఆరు నెలల పాటు తన పరిపాలన అంతా ప్రజల మధ్యనే ఉంటూ ముందుగా సాగాలని కేసీఆర్‌ నిర్ణయించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తూ పదో వసంతంలోకి ఎన్నికలు రావడం బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా కలిసివస్తోంది. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వరకు, రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు- ఉత్సవాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో తొలిరోజు ఉత్సవాలు ప్రారంభం కాగా మంత్రులు వారివారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు.

నలుమూలలకు విస్తరించిన తెలంగాణ ప్రగతి ప్రస్థానం
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమష్టి కృషితో నేడు కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అత్యద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నలుమూలలకు విస్తరించిన తెలంగాణ ప్రగతి ప్రస్థానం, పరిపాలనా విధానం, ముఖ్యంగా సంక్షేమ పథకాల ఫలితాలు దేశానికే రోల్‌ మోడల్‌గా మారాయి. ఇక్కడి ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల పాలకులు, ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటు-న్నామని సీఎం కేసీఆర్‌ అనేక సందర్భాల్లో, తాజాగా జరిగిన బహిరంగ సభల్లోనూ ధీమాను వ్యక్తం చేశారు.

- Advertisement -

‘ధూం..ధాం’గా దశాబ్ది ఉత్సవాల ముగింపు
అదరగొట్టిన ఆరంభానికి రెట్టింపు ఉత్సాహంతో దశాబ్ది ఉత్సవాల ముగింపును మరింత ఘనంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఈ నెల 22న అమర జ్యోతి ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున సక్సెస్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అదేరోజు అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం నుంచి భారీ వాహన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 10వేల మందితో ర్యాలీలు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీలతో పెద్దఎత్తున ప్రచారం జరిగినట్లు- అవుతుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ముగింపు ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు వివిధ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎమ్మెల్యేలు ర్యాలీగా బయల్దేరి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే తెలంగాణ అమర జ్యోతి వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద కవులు, కళాకారులు, డీజేలను ఏర్పాటు- చేసి ”ధూం.. ధాం..”గా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ప్రతి రోజు ఒక్కో రంగానికి సంబంధించి ఒక్కో ప్రత్యేక కార్యక్రమాలను జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement