Saturday, November 23, 2024

భారీ బడ్జెట్ కు పథకాల హారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దళితుల అభ్యున్నతి తొలి ప్రాధాన్యతగా, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. వ్యవసాయ తోడ్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ను ఊతంగా చేసుకోనున్నది. అత్యధిక కుటుంబాలకు తన పథకాలతో చేరువయ్యేలా సరికొత్త రీతిలో 2023-24 బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతోంది. కొత్త, పాత పథకాల కలయికతో రూ. 3లక్షలకోట్లకుపైగా అంచనాతో ఎన్నికల ఏడాది బడ్జెట్‌ ఖరారైంది. కేంద్రంపై, పన్నులపై ఆధార పడకుండా స్వయం ప్రతిపత్తితో రూ.3 లక్షల కోట్ల మార్కును దాటేలా వ్యయం ప్రతిపాదిస్తూ తెలంగాణ ఎన్నికల ఏడా ది బడ్జెట్‌ సిద్దమవుతోంది. 2014-15లో తెలం గాణ తొలి బడ్జెట్‌ 2014 నవంబర్‌ 5న పది నెలల కాలా నికి రూ. 1,00,648కోట్లుగా ప్రతిపాదించగా, ఎని మిదేళ్ల తర్వాత ఈ బడ్జెట్‌ మూడింతలకు పైగా పెరగనుంది.


తెలంగాణకు ఎంత మేర కేంద్ర సాయమంద నుందో ఫిబ్రవరి 1న తేటతెల్లం కానుంది. ఇప్పటి వర కు ఇచ్చిం దేమీలేదని, ఇకపై ఏమిస్తుందనే ఆశలు పెట్టు కోకుండానే, కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండానే వార్షిక బడ్జెట్‌ సిద్దమవుతోంది. దేశంలోనే జీఎస్డీపీ వాటాలో తెలంగాణ రెండో స్థానం సాధించిన తెలం గాణ, 8శాతం సొంత పన్నుల ఆదాయం వాటాతో కేంద్ర ఆర్ధిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషి స్తోంది. 2019-20లో 69శాతం, 2020-21లో 72శాతం, 2021-22లో 73శాతం సొం త వనరుల రాబడినుంచే ప్రభుత్వం వ్యయాలు చేసి సొంత కాళ్లపై నిల్చింది. ఇక కేంద్రంనుంచి 2014-15లో పన్నుల వాటా రూ. 8189కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపం లో రూ. 6736కోట్లు, 2022-23లో కేంద్ర పన్నుల వాటా రూ.18వేల కోట్ల అంచనాల్లో రూ. 12,407 కోట్లకు సవరించారు. నవంబర్‌ నాటికి రూ. 7568 కోట్లే ఖజా నాకు చేరాయి. గ్రాంట్లు రూ. 8619కోట్లు మాత్రమే వచ్చాయి. గతంకంటే ఈ రెండు భారీగా తగ్గుదల నమోదయ్యాయి. అప్పుల్లో రూ. 19 వేల కోట్లు కోతలు విధించింది. ఈ ఏడాదిలో కేంద్రం నుంచి రూ. 59వేల కోట్ల అంచనాల్లో రూ. 24వేల కోట్లే వాస్తవంలో తెలంగాణకు చేరనున్నాయి.
దాదాపు కోటిన్నర దాటిన కుటుంబాలు, నాలు గున్నర కోట్ల ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుచూపు వ్యూహంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. గడిచిన ఏడున్నరేళ్ళుగా సీఎం కేసీఆర్‌ ఏది చేసినా ప్రత్యక్షంగా, పరోక్షంగా అది తెలంగాణ ప్రజల బాగు కోసమేనన్న వాదన నేపథ్యంలో హ్యాట్రిక్‌ విజయానికి ఈ బడ్జెట్‌ కీలకం కానుందని అంటున్నారు. రెండేళ్లుగా ఆర్ధిక ఒడిదు డుకులు ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా పన్నుల పెంపు జోలికి వెళ్లలేదు. కేంద్రం పెం చిన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలతో ప్రజలపై భారం పడి నప్ప టికీ ఆ మొత్తం కేంద్ర ఖజానాకే సెస్సుల రూపంలో వెళు తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెను కాడకుండా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, పరిశ్రమలు, గృహ వినియోగానికి కోతలు లేని నిరంతర కరెంట్‌ సరఫరాతో సమాజానికి మేలు జరుగుతోంది. గృహ వినియో గదారుల్లో 70 నుంచి 80శాతానికి పైగా గణనీయమైన సంఖ్యలో రైతులే ఉన్నారు.


పన్నుల పెంపుకు నో…
అయితే ప్రభుత్వం ప్రజలపై పన్నుల పెంపుకు సిద్దంగా లేదు. ఇక పథకాలను తగ్గించేందుకు కూడా ససేమిరా అంటోది. భూముల అమ్మకాలను వేగ వంతం చేయాలని భావించినా అది కూడా ఈ ఏడాది మార్చి చివరినాటికి విజయవంతం అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. 2022-23లో రాష్ట్రాలకు కీలక సొంత వనరుల రాబడి వనరుల్లో ఎస్‌జీఎస్టీ 23శాతం, అమ్మకం పన్ను 23 శాతం, ఎక్సైజ్‌ సుంకాలు 14శాతం, సంటాపు డ్యూ టీలు 11శాతం, వాహన పన్నులు 5శాతం, ఎలక్ట్రిసిటీ పన్నులు, సుంకాల వాటా 3శాతంగా ఉంది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి గతేడాది ఇదే సమయంకంటే 16శాతం వృద్ధిరేటును సాకారం చేసుకుంది.
ప్రణాళికేతర వ్యయంలో కోత…
తాజాగా ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని చూస్తోంది. రెవెన్యూ ఖర్చులతో ఉండే ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గిం చుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. ప్రణా ళికేతర వ్యయాల్లో భారీగా ఉద్యోగులు వేతనాలు, ఫించన్లు, పీఆర్సీ పరిహారాలు వంటివి ఉన్నాయి. ప్రతీనెలా దాదాపు వివిధ మార్గాల్లో రూ. 10వేల కోట్ల రాబడి ఖజానాకు చేరుతుండగా ఖర్చు రూ. 12వేల కోట్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రూ. 2 వేల కోట్ల నిధులకు కష్టంగా ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని సర్దు బాటు చేయడం ఆర్థికశాఖకు కష్టంగా మారింది.
తాజా బడ్జెట్‌ ప్రతిపాదనలు
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 35వేల కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 12వేల కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రూ. 3వేల కోట్లు
కొత్తింటి పథకం రూ. 18వేల కోట్లు
దళితబంధు రూ. 18వేలకోట్లు
మన ఊరు-మన బడి రూ. 2500కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ. 13000కోట్లు
పట్టణ ప్రగతి రూ. 1500కోట్లు
ఇరిగేషన్‌ రూ. 37వేల కోట్లు
పల్లె ప్రగతి రూ. 500కోట్లు
హరితహారం రూ. 1000కోట్లు
ఆర్‌ అండ్‌ బీ రూ. 25వేల కోట్లు
వేతనాలు రూ. 40వేల కోట్లు
ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటివ్‌లు రూ. 2500కోట్లు
వడ్డీ చెల్లింపులు రూ. 12వేల కోట్లు
లోన్‌ రీపేమెంట్‌ రూ. 18వేల కోట్లు
ఆర్ధికశాఖ రూ. 40వేలకోట్లు
పంచాయతీరాజ్‌ రూ. 25వేల కోట్లు
విద్యుత్‌ రూ. 13వేల కోట్లు
ఉపకార వేతనాలు రూ. 5వేల కోట్లు
కేసీఆర్‌ కిట్‌ రూ. 500కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement