హాజరుకానున్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు
అజెండా విడుదల చేసిన ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిథి : సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈనెల 16న సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించే రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన అజెండాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఖరారు చేశారు. మొత్తం 9 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వాటికి సంబంధించిన వివరాలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను సీఎస్ ఆదేశించారు.
అజెండాలోని అంశాలివే..
ప్రజాపాలన
ధరణి
వ్యవసాయం
ఆరోగ్యం- సీజనల్ వ్యాధులు
వన మహోత్సవం
మహిళా శక్తి
విద్య
శాంతిభద్రతలు
డ్రగ్స్ నిర్మూలన క్యాంపెయిన్
- Advertisement -