హైదరాబాద్ – పదేళ్ల విరామం తర్వాత తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరింది.. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లి 64 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. నేడు ఎల్ బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మందితో గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వీకారం చేయించారు.. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ కు చెందిన అతిరత మహరధులందరూ హాజరయ్యారు.
ఇండియా కూటమి చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల శాఖ మంత్రి మాణిక్ రావు ఠాక్రే తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు.