హైదరాబాద్ – ప్రభుత్వ నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ చిత్ర పరిశ్రమ ప్రతినిధులను కోరారు.. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని, వాటిలో చిత్ర ప్రముఖులు కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. వివిధ చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రి రేవంత్ తో నేడు భేటి అయ్యారు.. కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతున్నది..
ఈ సమావేశంలో సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు , అల్లు అరవింద్, మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, సి.కల్యాణ్, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్ , ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ తదితరులు హాజరయ్యారు.. మొత్తం సీని పరిశ్రమ నుంచి 36 మంది సభ్యులు పాల్గొనగా వారిలో. 12 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. ఇక ప్రభుత్వం తరుపున రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి విదేశాలలో ఉండటంతో ఈ బేటికి హాజరుకాలేకపోయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి వివిధ ప్రతిపాదనలు సినీ పరిశ్రమ ప్రతినిధుల ముందు రేవంత్ ఉంచారు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌కు సహకరించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరో. హీరోయిన్ లు పాల్గొనాలని ప్రతిపాధించారు..ఇక కొత్తగా విధించే టికెట్ల ధరలపై విధించే సెస్‌ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి వినియోగిస్తామని పేర్కొన్నారు.. అలాగే ఇకపై సీనీ ర్యాలీలు నిషేధిస్తామని పేర్కొంంది.. కులగణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలని కోరింది ప్రభుత్వం టిక్కెట్ ధరలు, బెన్ ఫిట్ షోలు, అదనపు షోలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని అంటూ ప్రస్తుతానికి టికెట్ ధరలు, బెన్ ఫిట షోలు అనుమతి ఇవ్వలేమని చెప్పినట్లు తాజా సమాచారం .. ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నది.