Saturday, November 23, 2024

ధాన్యం సమస్యలపై టోల్ ఫ్రీ : కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లాలో 170 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. రైతులు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించుట‌లో, తూకంలలో, మరే విధమైన సమస్యలు తలెత్తినా, సంబంధిత అధికారులు రైతుల సమస్యలపై స్పందించనున్న‌ట్లు తెలిపారు. రైతుల కోసం ప్రత్యేక‌ కంట్రోల్ రూం నెంబర్ 18004250520ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కంట్రోల్ రూం నిర్వహణకు షిఫ్ట్ ల వారిగా సంబంధిత శాఖ సిబ్బందికి విధులు కేటాయించి రైతుల సమస్యల పై 24 గంట‌లు అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement