Saturday, November 23, 2024

మాజీ ఎంపీ కంపెనీకి టోకరా.. ఏం జరిగిందో తెలుసా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త టి. సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స‌ సంస్థను ముంబాయికి చెందిన ఓ కంపెనీ మోసం చేసింది. తక్కువ కమిషన్‌ తీసుకుని రుణం ఇప్పిస్తామని నమ్మించి గాయత్రి ప్రాజెక్ట్స‌ సంస్థ ఛైర్మన్‌ ఇందిరా రెడ్డిని, ఛాంపియన్‌ ఫిన్‌ సెక్‌ సంస్థ డైరెక్టర్లు చేతన్‌ పటేల్‌, హర్షవర్ధన్‌ మోసం చేశారు. ఆ సంస్థ షేర్లను బహిరంగ మార్కెట్లో తనఖా పెట్టి రూ.11 కోట్లు దోచుకున్నారు. దీంతో జూలై 20 తేదీన గాయత్రీ ప్రాజెక్ట్స్‌ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సిసిఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హర్షవర్ధన్‌, చేతన్‌లను ముంబాయిలో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చిన నిందితులను సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. నిందితులిద్దరినీ వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో సిపిఎస్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement