మహబూబాబాద్ -, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ నేడు మహబూబాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరి 10:30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు.
పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. రూ.5 కోట్లతో వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్లను ప్రారంభిస్తారు. గుమ్మడూర్‌లో 200 డబుల్‌బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో 24,181 మంది పోడు రైతులకు 67,730 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడే పోడు రైతులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేస్తారు. ఆ తర్వాత తిరిగి రోడ్డు మా ర్గాన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు