Tuesday, November 19, 2024

నేడు అసెంబ్లీలో రాష్ట్ర బ‌డ్జెట్..

హైదరాబాద్‌ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను మ‌రికొద్ది సేప‌టిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈ సారి బడ్జెట్‌లో అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టేబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనకు అనుగుణంగా బ‌డ్జెట్ కు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement