ట్రాఫిక్, మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జారీ చేసిన ఈ-చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. బుధవారం వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోని వారి నుంచి పెండింగ్ ఇ-చలాన్లకు సంబంధించి పూర్తి జరిమానా వసూలు చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్ల పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలాన్లు చెల్లిస్తే 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని గడువు జనవరి 10 వరకే ప్రకటించింది. ఈ పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవాళ్టితో ముగియనుంది.