కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీజేపీ రణభేరీ మోగించింది. 6 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాలో భాగంగా బీజేపీ శ్రేణులు తమ ప్రాంతాల్లోని వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయించారు.
- Advertisement -
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పండించిన వరి పంటను కల్లాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కల్లాల పర్యటనకు బీజేపీ నిర్ణయం తీసుకున్నారు.