ఉట్నూర్ జూన్ 26 ప్రభ న్యూస్ – ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల (విశ్రాంతి ఉద్యోగుల) డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ నాయకులు ఉట్నూర్ డిప్యూటీ తాసిల్దార్ వేడమ భుజంగరావుకు వినతి పత్రం సమర్పించారు.
రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పిఆర్సి ఇవ్వాలని టీఎస్ జి ఆర్ ఈ ఏ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని, 398 రూపాయల కింద నియామకమైన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న రెండు డి ఆర్ లు ఇవ్వాలని ,తదితర డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అదిలాబాద్ సంఘం జిల్లా అధ్యక్షులు షర్ఫుద్దీన్ ప్రధాన కార్యదర్శి కట్ట లక్ష్మణ చారి, నాయకులు భూమయ్య సదానంద చారి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.