తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సంపదంతా దుబారా ఖర్చులకు వాడుతోందని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. తెలంగాణ ఆర్థిక నివేదిక అసంతృప్తిగా ఉందన్నారు. కాగ్ విమర్శించినా ప్రభుత్వానికి బుద్ధిరాలేదని విమర్శించారు. ఆదాయం పెరిగితే ఆత్మహత్యలు, నిరుద్యోగం ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. సంపద అంతా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉందన్నారు. ఇరిగేషన్‌పై పొదుపు పాటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. ప్రాజెక్టులపై అంచనాలు పెంచి కమిషన్లు తీసుకున్నారని కోదండరాం ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement