చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ పెద్దపెల్లి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజ్జుల మూర్తి తన స్నేహితుడైన తిరుపతికి 2014 సంవత్సరం లో రూ. 2,40,000 అప్పుగా ఇవ్వగా, అప్పు తీర్చుటకు తిరుపతి, మూర్తికి చెక్కు వ్రాసి ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అవడంతో ఈ విషయంగా మూర్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ తరుపున ఆర్. సురేష్ బాబు వాదనలు వినిపించి, తగు ఆధారాలు చూపగా, చెల్లని చెక్కు ఇచ్చిన తిరుపతికి ఒక సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష నాలుగు లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement