తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలను చల్లగా చూడాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నామన్నారు. ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.