Tuesday, December 3, 2024

Tirbutes – అమ‌ర వీరుడు శ్రీకాంతాచారికి కెటిఆర్, హరీశ్, క‌విత‌ల నివాళి …

హైదరాబాద్‌: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించింది.. తెలంగాణ భ‌వ‌న్ లో నేడు ఆయ‌న చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు బిఆర్ఎస్ నేత‌లు.. ఈ సంద‌ర్భంగా కెటిఆర్,హరీశ్ రావు, క‌విత‌లు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా శ్రీకాంత్ చేసిన త్యాగాన్ని స్మ‌రించుకున్నారు..

శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ( అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎక్స్‌ వేదికగా జోహార్లు అర్పించారు.

- Advertisement -

అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతా చారి అని చెప్పారు హ‌రీశ్ రావు . కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడని తెలిపారు. జోహార్ శ్రీకాంతాచారి అంటూ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో తన బలిదానంతో కోట్లాది తెలంగాణ గుండెలను కదిలించిన, తన అమరత్వంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన శ్రీకాంతా చారిని ఈ తెలంగాణ గడ్డ ఎప్పటికీ మరువబోదని పేర్కొన్నారు ఎమ్మెల్సీ క‌విత .తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా.. వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement