హైదరాబాద్ – తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం ఉదయం 9.30 గంటలకే విడుదల కానున్నాయి.. వాస్తవానికి ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. అయితే తాజాగా సమయంలోమార్పు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.. ఈ ఫలితాలను జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. కాగా, ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. ఎం సెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలంగాణతో పాటు ఏపీ నుంచి దాదాపు 2లక్షల మంది, అగ్రికల్చర్ పరీక్షకు దాదాపు లక్ష మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement