ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాలకు పోలీసులు నాలుగు అంచెల కంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ బస్‌స్టాండ్ దగ్గర భారీ ఎత్తుతో కంచెలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే దగ్గర రెండు రకాల కంచెలను ఏర్పాటు చేశారు.
కొత్తలో కంచెలను తొలగించామన్న ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కంచెలను తొలగించామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎలా కంచెలను వేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా కంచెలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఉద్యమాల నేపథ్యంలో
ఇటీవల పెరిగిన ఉద్యమాల నేపథ్యంలో అసెంబ్లీకి భద్రత పెంచి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా, జాబ్ క్యాలెండర్ తదితర కీలక బిల్లులపై చర్చ ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ చుట్టూ ఎలాంటి సమస్య లేకుండా పోలీసులు భద్రత పెంచారని సమాచారం ..