నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వరాజీనామా పత్రాలను పార్టీకి త్వరలో పంపుతాను అన్నారు కేవలం కేటీఆర్ మిత్రుడు ను టికెట్ ఇచ్చేందుకు ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని నిలిపి వేశారాణి ఆరోపించారు.. మంత్రి కేటీఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? కుంభకోణాలకు పాల్పడ్డానా? టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిన జాన్సన్ ఎస్టీ కానే కాదన్నారు.
కేటీఆర్ మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఖానాపూర్ నియోజకవర్గం గురించి ఆయనకి ఏం తెలుసని మండిపడ్డారు . మొన్నకి మొన్న నిర్మల్లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సభ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని అన్నారు, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీకి బరిలో ఉంటానని, ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే చెప్తాను అన్నారు . ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ సవాల్ చేశారు. అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. తనకు అనవసరంగా టిక్కెట్ నిరాకరించారంటూ రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపించడం ఖాయమన్నారు. రేపటి నుంచి ఖానాపూర్ నుండి ఇంద్రవెల్లి వరకు నియోజకవర్గ మొత్తం పాదయాత్ర చేస్తానని అన్నారు.