కామారెడ్డి ప్రభన్యూస్.జాతీయ రహదారి 44 పై 70 కోట్ల రూపాయలతో మూడు చోట్ల అండర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని జాతీయ రహదారులు అధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం నాడు కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో బోయిన్పల్లి నుండి ఆదిలాబాద్ దాటిన తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి 44 ఉంటుందని ఈ జాతీయ రహదారిపై కామారెడ్డి జిల్లా పరిధిలో మూడు చోట్ల 70 కోట్లతో అండర్ పాస్ వే బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నరసనపల్లి బైపాస్ వద్ద, టేక్ రియల్ బైపాస్ వద్ద, పద్మావతి వాడి ఎక్స్ రోడ్ వద్ద 70 కోట్లతో అండర్ వాసవి విడుదలను నిర్మిస్తున్నామని పనులు ప్రారంభమయ్యాయని ఏడాది కాలంలోపు మూడు బ్రిడ్జిలు నిర్మిస్తామని జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మూడు చోట్ల అండర్ పాస్ వే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభమైన ట్లు తెలిపారు. తుఫ్రాన్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై నాగులపల్లి వద్ద నిర్మిస్తున్న పద్ధతిలో కామారెడ్డి జిల్లాలో 3 చోట్ల అండర్ పాస్ వే బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని ఎన్ హెచ్ ఎ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. జాతీయ రహదారి వాహనాలు బ్రిడ్జి పైనుండి, జిల్లా వాహనాలు, అంతరాష్ట్ర వాహనాలు బ్రిడ్జి నుండి వెళ్లేలా బ్రిడ్జి ల నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తుఫ్రాన్ నాగులపల్లి వద్ద రైలు పైనుండి పోతుందని ఇతర వాహనాలు వెళ్తాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మూడు మేజర్ కల్వర్టుల నిర్మాణానికి 70 కోట్ల మంజూరైనట్లు పనులు ప్రారంభమయ్యాయని జాతీయ రహదారి 44 పై పలుచోట్ల వంతెనలు ఆరు లైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బోయిన్పల్లి నుండి 44వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర సరిహద్దు వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం మంజూరయిందని పనులు ప్రారంభమయ్యాయని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.