హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాగల మూడురోజుల పాటు- రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడిందని, దానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటు-ందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.