Wednesday, November 20, 2024

మరో మూడు రోజులు భారీ అతి భారీ వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరుణుడు రాష్ట్రంపై జాలి చూపడం లేదు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని 17 జిల్లాలు పూర్తి స్థాయిలో అతలాకుతలం కాగా జనజీవన స్తంభించిపోయింది. తాజాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పిడుగు లాంటి సమాచారం అందజేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పింది. రెడ్‌ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. గురువారం వరకు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాత్రికి బలహీనపడి అల్పపీడనంగా మారిందని తెలిపింది.

ఈ ప్రభావం రాష్ట్రంపై రానున్న రోజుల్లో తక్కువగా ఉంటుందని పేర్కొంది. వచ్చే మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతుందని తెలిపింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రమే అత్యల్ప వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని వివరించింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాటి వేగం గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement