Tuesday, November 26, 2024

ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు..

ములుగు, ప్రభాన్యూస్ : సోమవారం రోజున 151 బి ఎన్ సిఆర్పీఫ్, ములుగు జిల్లా పోలీస్ అధికారుల ఎదుట ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. కోసం సోమ, అలియాస్ మధు, అలియాస్ సమ్మయ్య తండ్రి హద్మ, వయసు 45 , దొడ్డి నంద తండ్రి కొయ్య వయసు 33 , మడకం గంగ తండ్రి సోమ, వయసు 45 వీరు ముగ్గురు మావోయిస్టులు పలు కార్యక్రమాల్లో పాల్గొని మావోయిస్ట్ పార్టీ నుండి వేధింపులు ఎదురౌతున్న నేపథ్యంలో మావోయిస్టు వీడాలని నిర్ణయించుకొని పోలీస్ ల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో కోసం సోమ, అలియాస్ మధు, అలియాస్ సమ్మయ్య చత్తీస్ఘడ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లా ఉసుర్ మండలంలోని సర్కె గూడ గ్రామానికి చెందిన వాడు కాగా , దొడ్డి నంద చత్తీస్ఘడ్ రాష్ట్రం లోని సుకుమా జిల్లా జగర్గొండ మండలంలోని గోన్దపల్లి, మడకం గంగ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడ మండలంలోని గగన పల్లి గ్రామానికి చెందినవారు.

ఈ సందర్బంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపిఎస్ మాట్లాడుతూ దళ సభ్యులు లేదా మిలీషియా సభ్యులు ఎవరైనా లొంగిపోయి మెరుగైన జీవితాన్ని గడపడానికి వారి కుటుంబ సభ్యుల ద్వారా లేదా గ్రామ పెద్దల ద్వారా పోలీసు వారిని సంప్రదించాలాన్నారు, గౌరవ ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ఈ క్రమంలో ములుగు పోలీస్ బృందం తరుపున యువత కు ఉచిత రెసిడెన్సీయల్ శిక్షణ ఇస్తున్నామని తప్పకుండ గ్రామీణ ఆదివాసి యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement