Friday, November 22, 2024

TS : తొలి రోజే ముగ్గురు ఇన్విజిలేట‌ర్ల‌పై వేటు..

పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటుపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో విద్యార్థులు చూసుకొంటూ రాస్తుండగా, ఇన్విజిలేటర్‌ పట్టించుకోలేదు. దీంతో అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి విధుల నుంచి అతనిని తప్పించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడగా, ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని తేలింది. దీంతో ఇక్కడ ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించారు.

- Advertisement -

పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలిరోజు నాలుగు మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. స్కాడ్‌ తనిఖీల్లో ఈ నలుగురు పట్టుబడగా, ఆయా విద్యార్థులను డిబార్‌ చేశారు. మొదటిరోజు మొత్తం 99 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 4,94,877 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు 4,93,417 (99.70శాతం)మంది విద్యార్థులు పరీక్ష రాశారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement