తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
వడగాల్పులు సైతం విజృంభణ
ఏకంగా 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం
అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. వడగాల్పులు ప్రమాదం ఉందని కూడా పేర్కొంది. మాడు పగిలే ఎండలు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ మూడు రోజులు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది.
ఈ నేపథ్యం లో నేటి నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇది ఇలా ఉంటే… ఆదిలాబా ద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో విపరీతమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరుగవచ్చని తెలిపింది. 28న వేడిగాలులు కొనసాగుతాయని, తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట వంటి జిల్లాల్ల్లో ఎండ తీవ్రత ఎకువగా ఉంటుందని పేర్కొన్నది. వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది.