- పిప్పల్ కొటి శివారు ప్రాంతంలో ఘటన
- బయందొనల్లో గ్రామాల ప్రజలు
- సంఘటన స్థలాన్ని పర్శిలిస్తున్న అటవీ శాఖ అధికారి
భీంపూర్ : పెద్దపులి దాడి ఘటనలో మూడు ఆవులు మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని పిప్పల్ కొటి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎప్పటి లాగే శుక్రవారం సమీప అటవీ ప్రాంతానికి మేత కోసం వెళ్లిన ఆవులు తిరిగి రాకపోవడంతో శనివారం ఉదయం అటవీ ప్రాంతంలో వెతుకుతుండగా మూడు ఆవులు మృత్యువాత పడ్డట్టుగా గమనించారు.
ఆవులు మృతిచెందిన తీరుని చూసి పెద్దపులి దాడి వల్లే తమ ఆవులు మృతిచెంది ఉంటాయని ఆవుల యజమానులు నజీర్, చాంద్ లు ఆవేదన చెందారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పెద్దపులి ఆనవాళ్లు ఎలాంటివి దోకలేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. పక్కనే ఒక అటవీ పంది మృతదేహం కూడా ఉంది.
ఆనవాళ్లను పరిశీలించి వివరాలు తెలియజేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం ఇక్కడి ప్రాంతానికి ఇదే సమయంలో పక్కనే అన్న తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుండి వస్తుంటాయి. ఈ ఘటనతో మళ్ళీ పెద్దపులి వచ్చి ఉంటుందని అక్కడి గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.