Saturday, November 23, 2024

గంజాయి తీసుకురానందుకే హత్య…ముగ్గురు బిహారీల అరెస్టు

నిజామాబాద్ అర్బన్, మే 5 (ప్రభన్యూస్) : గత నెల 23 న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు బిహరీలను అరెస్ట్ చేసి వారివద్దనుంచి ఒక తపంచా ( తుపాకీ), రెండు బులెట్లను స్వాధినం చేసుకున్నట్లు నిజామాబాద్ ఏసీపీఎం.కిరణ్ కుమార్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం రాం పూర్ గ్రామంలోని శ్రీ విశ్వ అగ్రోటెక్ కంపనీలో బిహార్ రాష్ర్టంలోని ఖగారియా జిల్లా రోహియానా తానా పరిధిలోని సిపాహిసింగ్ వాసకు చెందిన సికేంద్ర కుమార్ ( గుమాస్తా), రోహిత్ కుమార్ ( కూలీ) ,బిహార్ రాష్ర్టంలోని ఖగారియా జిల్లా శిరోమణి ఫటాల కు చెందిన ధరేంధ్ర కుమార్ ( కూలీ) గా పని చేస్తున్నారు. వారు పని చేస్తున్న ప్రాంతంలోనే ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన నబిసాబ్ అలియాస్ అక్బర్ ( 24), మోపాల్ మండలం నర్సింగ్ పల్లికి చెందిన జావిద్ లు స్నేహితులు అయ్యారు. గత నెల 24న మద్యం త్రాగేటప్పుడు బీహార్ వాళ్ళు గంజాయి కావాలని అడిగారు. వాళ్ళకు గంజాయి తీసుకువస్తానని చెప్పి రూ.1000 తీసుకొని గాంధారి రోడ్ కు తీసుకుపోయిన జావీద్ అక్కడ నుండి పారిపోయాడు.

దానితో నబిసాబ్ ను ముగ్గురు బిహారీలు కలిసి నువ్వు,జావీద్ కలిసి కావాలనే మా దగ్గర 1000 రూపాయలు తీసుకొని గంజాయి తీసుకురాకుండా మోసం చేసినారని గోడవ పడ్డారు. నబిసాబ్ అలియాస్ అక్బర్ ను తాము ఉండే రూమ్ కు తీసుకుపోయి గంజాయి తేలేదని కోపంతో చంపాలనే ఉద్దేశ్యంతో తుపాకి తో బెదిరించి, ముఖంపై చేతులతో కొట్టారు. నబిసాబ్ గది నుండి రోడ్ మీదకు గుంజుకుపోయి తలను రోడ్ కి కొట్టి ప్రక్కనున్న ఖాళీ స్థలం లోకి కాళ్ళు పట్టి గుంజుకుపోయి నోరు మూసి గొంతు పిసికి చంపివేసి పరారీ అయ్యారు.

. మృతుని భార్య పేరు షేక్ అమ్రిన్ బేగం ఇచ్చిన పిర్యాదు మేరకు ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ లో మర్డర్ కేసు నమోదు చేసి డిచ్ పల్లి సిఐ కె.కృష్ణ, ఇందల్వాయి ఎస్ఐ నరేష్ లు విచారణ చేపట్టారు. గురువారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహర్ కు పరారీ అయ్యేందుకు సికేంద్ర కుమార్ ,రోహిత్ కుమార్ , ధరేంధ్ర కుమార్ లను పట్టుకోని విచారించగా తామే ముగ్గురం గంజాయి కోసం డబ్బులు ఇస్తే మోసం చేశారని నబిసాబ్ ను కోట్టి, గోంతుపిసికి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి వారివద్ధ నుంచి ఓక తపంచా( తుపాకీ) , రెండు బుల్లేట్లు, ఒక బైక్, రెండు సెల్ పోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి తెలిపారు. ముగ్గురు బిహరీలను అరెస్టు చేసి కోర్టు ముందు హజరు పరుచగా రిమాండ్ విధించారని ఎసిపి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement