ఆంధ్రప్రభ స్మార్ట్, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత సెప్టెంబర్ 28వ తేదీన +447886696497 నుండి వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రూ.20 లక్షల ఇవ్వాలని, లేకుంటే ఇద్దరు పిల్లలను అనాథలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడు రంగారెడ్డి జిల్లా…
నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవానీ నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) గా గుర్తించారు. ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నట్లు, అక్కడి నుండే బెదిరింపులకు పాల్పడినట్లు, నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.