హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. ఇరుగు పొరుగు వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే.. ఆ గొడవలే ఓ వ్యక్తి మరణానికి దారితీశాయి.. రామంతాపూర్ సత్యనగర్ కాలనీలో శ్రీనివాస్, నాగరాజు పక్కపక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. నాగరాజు హోంగార్డుగా పని చేస్తున్నాడు.
బాధిత కుటుంబం కథనం ప్రకారం.. హోంగార్డ్ నాగరాజు పిస్టల్‌తో తన పక్క ఇంటిలో ఉంటున్న శ్రీనివాస్ (55)ను బెదిరించాడు. దీంతో అతడు భయపడి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆగ్రహించిన కుటుంబం.. మృతదేహంతో ఆందోళన
శ్రీనివాస్ మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు హోంగార్డ్ ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ మృతికి నాగరాజే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నాగరాజు పిస్టల్ తో బెదిరిస్తూ శ్రీనివాస్‌ను వేధించారని తెలిపారు. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు అంటున్నారు.
హోంగార్డుని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
మృతుడి కుటుంబం ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్ఛచెప్పి విరమింపజేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హోంగార్డు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. 3 ఏళ్లుగా మృతుడు శ్రీనివాస్‌కు నిందితుడు నాగరాజుకు మధ్య గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది.