కామారెడ్డి, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విద్యావేత్త తోట లక్ష్మి కాంతరావు కర్ణాటక ఎన్నికల పరిశీలకుడిగా నియామకమయ్యారు. ఆయన జుక్కల్ నియోజకవర్గంలో అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఇంకా బలతోపేతం చేయడం, సామాజిక, స్వచ్చంద, భక్తి కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అఖండ హరినామసప్త లాంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొని జుక్కల్ నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందారు. వీరి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక రాష్ట్రంలో మే 10వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్, జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ కాంతారావును ఏఐసీసీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ లిలోతీయ కర్ణాటకలోని చించోలి నియోజకవర్గ పరిశీలకుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ… అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, చించోలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనను నమ్మి ఈ బాధ్యతను అప్పజెప్పిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కొప్పుల రాజు, ఏఐసీసీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ లీలోతియ తెలంగాణ కాంగ్రెస్ దళిత విభాగం చైర్మన్ నాగర ప్రితం కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు అప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించేందుకు సత్వరమే కర్ణాటక బయలుదేరుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.