Thursday, January 30, 2025

TG | ఆ నేతలు నా కాలిగోటికి కూడా సరిపోరు : మంత్రి కోమటిరెడ్డి

కేటీఆర్, హరీష్ రావులు నా కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదని.. ఊరువాడా తిరిగి తెలంగాణ కోసం పోరాడారని అన్నారు. గద్దర్ పై బండి విమర్శలు కరెక్ట్ కాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండలో బీఆర్ఎస్ రైతుల సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. బీఆర్ఎస్ సభకు కనీస రెస్పాన్స్ కూడా లేదని అన్నారు. పదేళ్లలో పాలనలో బీఆర్ఎస్ నల్గొండను పట్టించుకోలేదని అన్నారు. కేవలం ఎన్నికల కోసమే నల్గొండ ఐటీ టవర్ ఓపెన్ చేశారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.

70శాతం పనులు పూర్తయినా ఎస్ఎల్ బీసీని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. 300 ఎకరాల్లో నల్గొండలో మహాత్మా గాంధీ వర్సిటీ ఏర్పాటు చేయించానని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ మహాత్మా గాంధీ వర్సిటీని చూడలేదని అన్నారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి పోరాడానని అన్నారు. ఫ్లోరైడ్ నిర్మూలన కోసం నిరాహార దీక్షలు చేశానన్నారు. అమెరికా నుండి డైరెక్ట్ గా వచ్చి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడన్నారు.

కేసీఆర్ కొడుకుగా, అల్లుడుగా వారు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని అన్నారు.ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement