Saturday, January 4, 2025

TG | ఈ ఏడాది ఉప ఎన్నిక‌లు ఖాయం.. కేటీఆర్

  • ఈ కారు రేస్ కేసులో ప‌స‌లేదు
  • త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని రేవంత్ త‌ప‌న‌
  • ఇప్ప‌టికే అయిదుసార్లు ప్ర‌య‌త్నించారు
  • ఈ కారు కేసు ఆరో ప్ర‌య‌త్నం
  • తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో కేటీఆర్


హైద‌రాబాద్ – పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ త్వ‌ర‌గానే నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నామ‌ని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే స్థానాల‌కు ఈ ఏడాది ఉప ఎన్నికలు రావడం ప‌క్కా అని పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండ‌ర్ ను ఇవాళ‌ ఆయ‌న విడుద‌ల చేశారు. అనంత‌రం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ… స్పీక‌ర్ తేల్చ‌కుంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ‌తామన్నారు.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప‌స‌లేదు..
హైద‌రాబాద్ – ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని పునరుద్ఘాటించారు కేటీఆర్. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని.. కేసులో పసలేదని, అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిదని వ్యాఖ్యానించారు. కేసు వాదోపవాదాల్లో కోర్టులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు. త‌న‌ను ఎలాగోలా జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఫార్ములా ఈ రేసు కేసుతో ఆరో విఫల యత్నం చేశార‌ని కేటీఆర్ ఆరోపించారు. కారు రేస్ కేసులో తన‌ను అరెస్ట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు.

- Advertisement -

7న ఈడీ విచార‌ణ…
ఈనెల 7న ఈడీ విచారణకు నేను హాజరయ్యే విషయమై త‌న న్యాయనిపుణులు నిర్ణయిస్తారన్నారని పేర్కొన్నారు కేటీఆర్. త‌న‌కు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ కాంట్రాక్టుల్లో రూ.12వేల కోట్ల అవినీతి జరుగబోతుందన్నారు. బడా కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాగా, కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement