హైదరాబాద్ : జాతీయ పురస్కారం అందుకున్నఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు కేటీఆర్. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.
ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్‌ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.
- Advertisement -