Monday, November 18, 2024

మూడో రోజు జ‌మున హేచ‌రీస్ భూముల రీ స‌ర్వే

మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సంబంధించిన జమున హేచరీస్ భూముల రీ సర్వే మూడో రోజు కొనసాగుతోంది. ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ జమున హెచరీస్ భూములపై భూ కబ్జా వ్యవహారంలో రంగంలోకి దిగిన తెలంగాణ సర్కార్ తీరుపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇక జమున హేచరీస్ భూముల రీ సర్వే స్థలానికి సమీపంలో టీఆర్ఎస్ నాయకులు ఉండటం రాజకీయ దుమారంగా మారుతుంది.
మెదక్ జిల్లా మూసాయి పేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో దళితులు పేదలకు సంబంధించిన అసైన్డ్ భూములను ఈటెల రాజేందర్ కబ్జా చేశారని కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేయడంతో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలోనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement