మంచి, చెడులు ఆలోచించి ఓటు వేయండని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… మీ పోరాట ఫలితమే యాదాద్రి భువనగిరి జిల్లా అన్నారు. భువనగిరిలో అద్భుతమైన పంటలు పండుతున్నా యన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు.
ధరణి వల్ల భూములు లాక్కునే పరిస్థితి లేదన్నారు. ధరణి పోతే రైతులపై రాబంధులు పడతారన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని అంటున్నారన్నారు. భువనగిరి అద్భుతమైన నియోజకవర్గమన్నారు. భువనగిరిలో స్పెషల్ ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. మళ్లీ పైరవీకారుల రాజ్యం కావాళా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ వీఆర్వోల వ్యవస్థ వస్తుందన్నారు. దేశంలో 24గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు.