Tuesday, January 7, 2025

TG | వికారాబాద్ జిల్లాలో దొంగల హల్ చల్..!

  • నాలుగు ఇండ్లల్లో చోరీ, ఓ ఇంట్లో బంగారం మాయం
  • తాండూరు మండలం కొనాపూర్‌లో ఘటన
  • పరిశీలించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి


తాండూరు రూరల్ : తాండూరు మండలంలోని గ్రామంలో గుర్తుతెలియని దొంగలు హల్ చల్ చేశారు. నాలుగు ఇండ్లల్లో చోరీకి పాల్పడి ఓ ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు మండలం కోనాపూర్‌ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి గ్రామానికి చెందిన బంటు నర్సింలు ఇంట్లో చోరీ జరిగిందని కరన్‌ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టగా.. నర్సింలు ఇంటితో పాటు మరో మూడు ఇండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు విరగ్గొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

అయితే నర్సింలు ఇంట్లో తులంన్నర బంగారం చోరీ కాగా, మిగతా ఇండ్లలో ఎలాంటి సొత్తు పోలేదని గుర్తించారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్‌లు గ్రామాన్ని సందర్శించి చోరీ జరిగిన విధానాన్ని ఆరా తీశారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అదేవిధంగా చోరీకి వచ్చిన ఓ అనుమానితుడు ఇండ్ల పక్కన వేసిన సీసీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు అతని పాద ముద్రలను గుర్తించారు. బాధితుల ఇండ్లలో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని తీరుతామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్‌, ఎస్ఐ విఠల్ రెడ్డిలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement