నిందితుడి నుండి పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ హైదరాబాద్, జగ్గగిరిగుట్ట ప్రాంతానికి చెందిన గందేశీ శివకుమార్ హైదరాబాద్లో మెకానిక్ గా చేస్తుండగా వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో ద్విచక్రవాహనాలను చోరీ చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్నాడు. అనుకున్నడే తడువుగా నిందితుడు 2013 సంవత్సరం నుండి 2016 వరకు హైదరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడటంతో పాటు ఒక హత్య కేసులో సైతం నిందితుడు కావడంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2016 సంవత్సరంలో జైలు నుండి విడుదలై నిందితుడు 2019 సంవత్సరంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగాం, బచ్చన్నపేట, మట్టేవాడ పోలీసు స్టేషన్ల పరిధిలో ఏడుకు పైగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడటంతో పాటు జనగాం పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది.
నిందితుడు గత నవంబర్ మాసంలో జైలు నుండి విడుదలైన అనంతరం నిందితుడు తన పద్ధతి మార్చుకోకుండా ఈ గత సంవత్సరం నవంబర్ 10వ తేదిన హన్మకొండలోని కేయూసి ప్రాంతంలో పార్కింగ్ చేసి వున్న రెండు ద్విచక్రవాహనాలను చోరీ చేసాడు. ఈ చోరీలపై తక్షణమే స్పందించిన పోలీసులు డిసిపి పుష్పా అదేశాల మేరకు సిసిఎస్, కేయూసి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సంఘటన జరిగిన ప్రాంతంలోని సిసి కెమెరాల దృష్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించడం జరిగింది. నిన్నటి రోజున నిందితుడు చోరీ చేసిన వాహనాన్ని కన్సల్టెన్సీలో అమ్మేందుకుగాను ద్విచక్ర వాహనంపై బయలుదేరగా కేయూసి జంక్షన్ వద్ద వాహనాల తనీఖీ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితుడు అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు పాల్పడిన ద్విచక్ర వాహనచోరీలను అంగీకరించడంతో పాటు, నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చోరీ చేసిన మరో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం ఎసిపి బాబురావు, సిసిఎస్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, కేయూసి ఇన్ స్పెక్టర్ జనార్దన్, ఎస్.ఐ సంపత్, సిసిఎస్ ఎస్ఈ బాబురావు, ఏ.ఎస్.ఐ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్ళు విశ్వేశ్వర్, సుధాకర్, నర్సింగరావులను పోలీస్ కమిషనర్ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital