చర్లపల్లి : చర్లపల్లిలో రైల్వే స్టేషన్ లో రేపటి నుంచి మూడు రైళ్లు ఆపనున్నారు. అలాగే చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా నడపనున్నారు. హైదాబాద్ - చెన్నై సెంట్రల్ రైలు (12603/12604), సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ రైలు (12589/12590) ఇక నుంచి చర్లపల్లిలోని నూతన టెర్మినల్ నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
7వ తేదీ నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201), సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17233), సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైలు (17234) చర్లపల్లిలో ఆగుతాయని అధికారులు తెలిపారు.
చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే…
- 6, 8,11,15 తేదీల్లో చర్లపల్లి నుంచి తిరుపతి , 7,9,12,16 తేదీల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు.
- 7,9,13,15,17 తేదీల్లో చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు, అలాగే 8,10,14,16,18 తేదీల్లో నర్సాపూర్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు.
- 13న వికారాబాద్ నుంచి కాకినాడ, అలాగే 14 కాకినాడ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు.
- 9న కాచిగూడ-చర్లపల్లి-తిరుపతి రైలు, అలాగే 10వ తేదీన తిరుపతి-చర్లపల్లి-కాచిగూడకు ప్రత్యేక రైళ్లు.
- 12, 19 తేదీల్లో సికింద్రాబాద్-చర్లపల్లి-కాకినాడ, అదే రోజు కాకినాడ-చర్లపల్లి-సికింద్రాబాద్ రైళ్లు.
- 8,10,14,16,18 తేదీల్లో నర్సాపూర్-చర్లపల్లి రైళ్లు.
- 9,12,14 తేదీల్లో చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు, అలాగే 10,13,15 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లి మధ్య రైళ్లు.
- 7న కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్డు, అలాగే 8న శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు.
- 6,13 తేదీల్లో నాందేడ్-కాకినాడ, అలాగే 7,14 తేదీల్లో కాకినాడ-నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లు.