తెలంగాణలో సామాన్యుల పక్షాన పోరాడుతూ.. సమర్థవంతమైన నాయకత్వంతో పార్టీని అధికారంలో తెవడం కోసం నిరంతరాయంగా పని చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ అన్నారు. పార్టీ బలోపేతానికి కష్టించి పనిచేసే కార్యకర్తలను గుర్తించి తగిన గౌరవం కల్పిస్తామన్నారు. ఆదివారం డిల్లీ పర్యటనకు వచ్చిన తను పార్టీ తెలంగాణ ఎలక్షన్ ఇన్చార్జి సోమనాథ్‌తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండ గట్టడానికి, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అధికార ప్రతినిధులను నియమించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆమ్ ఆద్మీ అధికార ప్రతినిధులు..
1. సురేష్ తాళ్లపల్లి, 2.అబ్దుల్ ముక్తదిర్, 3. అడ్వకేట్ యమున, 4. డాక్టర్ పప్పుల సుధాకర్, 5. అడ్వకేట్ మహమూద్ అలీ, 6. వంగరి అజయ్, 7. అడ్వకేట్ సామ్రాట్ వేణుగోపాల్, డాక్టర్ సోమశేఖర్ రావు రాష్ట్ర మీడియా ఇంచార్జి గా నియమించారు. పార్టీలో క్రమశిక్షణ ప్రమాణాలు పెంచడం కోసం అంతటి హరి ప్రసాద్ గౌడ్ కన్వీనర్ గా తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఎడగొట్టు లక్ష్మీనారాయణ , భేతపుదయ్ యేహోషువ (జాషువా), చంద్రశేఖర్, గోర్ శ్యాంసుందర్ ని నియమించినట్టు ఇందిరా పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంబంధాల అధికారిగా సయ్యద్ గఫార్ ని నియమించారు.