Saturday, January 11, 2025

TG | విచార‌ణ పూర్తయిన త‌ర్వాతే అరెస్ట్ లు.. మంత్రి పొంగులేటి

  • ఈ కార్ రేస్ కేసులో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తున్న‌ది
  • త‌మ ప్ర‌భుత్వంలో క‌క్ష సాధింపులుండ‌వ్
  • ఈడీ ఎంట‌ర్ లో త‌మ ప్ర‌భుత్వ పాత్ర లేనే లేదు
  • కేటీఆర్ భాష‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు
  • త‌గిన స‌మ‌యంలోనే ప్ర‌జ‌లు బుద్ది చెబుతార‌న్న మంత్రి పొంగులేటి


హైద‌రాబాద్ – త‌మ‌ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్ష్యపూరితంగా చర్యలు చేపట్ట‌దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కారు రేసింగ్ లో చట్టం తన పని తానే చేసుకుని పోతుంద‌న్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డినీ లొట్టపీస్ ముఖ్యమంత్రి అన్నార‌ని అంటూ ఆయన బాషకు నమస్కారమ‌ని ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నేత‌లు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నార‌ని, త‌గిన స‌మ‌యంలోనే వారికి ప్ర‌జ‌లు బుద్ది చెబుతార‌ని చెప్పారు.

విచారణ కాకుండా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరినీ అరెస్టు చేయద‌ని, అది బండి సంజయ్ కి కూడా బాగా తెలుసన్నారు. ఏసీబీ రంగాల్లోకి రాగానే ఈడీ ఎంటరైంద‌ని వివ‌రించారు. ఈ కారు రేస్ లో అవినీతి జరిగిందని రుజువైంది.. కాబట్టి ఈడీ రంగంలోకి వచ్చిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అన్ని విచార‌ణలు పూర్తయిన వెంట‌నే అరెస్ట్ ప్రక్రియ కూడా మొద‌లు కావ‌చ్చ‌న్నారు.

26న ఏకంగా నాలుగు హామీలు అమ‌లు..
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక, రైతుబంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తున్న‌ద‌ని, వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఇవ్వదని బీఆర్ఎస్ ప్రచారం చేస్తే.. మేం రూ.12 వేలు ఇవ్వ‌నున్నామ‌న్నారు. రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని వెల్లడించారు.

- Advertisement -

ఇక, గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లని పూర్తి చేసి ప్రజలకి అందిస్తామ‌న్నారు. మొదటి విడతగా నియోజ‌క‌వర్గానికి 3,500 ఇళ్లు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement