వ్యవసాయంలో ఆర్థికంగా మరింత ఎదగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ మండలంలోని ముగ్ధుంపూర్ గ్రామంలో రూ.3కోట్ల వెనకబడిన తరగతుల నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల వ్యవసాయ బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల కార్యదర్శి సైదులు, జడ్పీటిసి, ఎంపిటిసి ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థినులతో మంత్రి ముచ్చటించారు. స్వామినాథన్ ను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు పోవాలన్నారు. సాంకేతిక విప్లవాన్ని వ్యవసాయంలో సృష్టించాలనన్నారు. నిరుద్యోగం పెరిగి అందరూ వ్యవసాయం వైపు చూడాల్సి వస్తదని, వ్యవసాయంలో ఆర్థికంగా మరింత ఎదగాలన్నారు. మహిళలుగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.