తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. అవసరానికి మించి యూరియా నిల్వలున్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. బ్లాక్ మార్కెట్లోకి యూరియా వెళ్లే అవకాశమే లేదన్నారు. ఎరువుల ధరలు పెంచి కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. ఎరువుల ధరలపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్నారు. కేంద్ర నిర్ణయం తర్వాత ఎరువుల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయముంటుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..