Thursday, November 21, 2024

టిఆర్ ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు.. ఈటెల

టిఆర్ ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపికి గుడ్ బై చెప్పబోతున్నారా తిరిగి మల్లి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది. వామపక్ష భావజాలంతో రాజకీయంగా ఎదిగిన ఈటెల రాజేందర్.. బిజెపిలో ఇమడలేక పోతున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ అంశంపై ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement