Wednesday, December 18, 2024

TG | ప్ర‌భుత్వాన్ని వ‌దిలేదిలేదు.. బీఆర్ఎస్ నేత జ‌గ‌దీష్ రెడ్డి

  • ఎంత పారిపోయానా వెంట‌ప‌డ‌తాం
  • ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో రాజీప‌డ‌బోం
  • అసెంబ్లీలోనూ, బ‌య‌ట కూడా మా నోరు నొక్కుతున్నారు
  • అయినా పోరాటం అపేది లేదంటున్న బీఆర్ఎస్ నేత జ‌గ‌దీష్ రెడ్డి


హైద‌రాబాద్ – ఎంత తప్పించుకున్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు జగదీశ్‌ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయ‌న‌ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం పారిపోతుందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ మాత్రం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజలపై పడిందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో బడాబాబులకు దోచిపెట్టే కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. లగచర్ల రైతులపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని తెలిపారు. జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. లగచర్ల ఘటనపై చర్చకు కోరితే ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదన్న విషయం గుర్తించాలని జగదీశ్‌ రెడ్డి హిత‌వు ప‌లికారు. స్పీకర్ త‌మ‌ నోరు నొక్కుతూ, త‌మ‌ను తిట్లు తిట్టేవారికే అవకాశం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు.

కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గీత కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కేపీ వివేకానంద మాట్లాడుతూ.. డ్రగ్స్‌ నియంత్రణ, నివారణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

- Advertisement -

గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు… సందు సందులో డ్ర‌గ్స్ అమ్మ‌కాలు…
తెలంగాణ‌లో సందు సందులో డ్ర‌గ్స్ అమ్మ‌కాలు పెరిగాయ‌ని, అదేవిధంగా గ్రామగ్రామాన గల్లీగల్లీలో బెల్ట్‌ షాపుల బెడద ఎక్కువైందని కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. బెల్ట్‌ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కానీ బెల్ట్‌ షాపుల పేరిట గీత కార్మికుల ఇండ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

గీత కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని విమర్శించారు. కిల్లీ బడ్డీల్లో కూడా డ్రగ్స్‌, గంజాయి దొరుకుతోందని కేపీ వివేకానంద తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణ, నివారణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. బెల్ట్‌ షాపుల నియంత్రణకు, గీత కార్మికుల వృత్తిని కాపాడుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement